W.G. ఉండి మండలం ఆరేడు గ్రామంలో వెంచేసియున్న శ్రీ ముత్యాలమ్మ – కొండలమ్మా తల్లి విగ్రహ, ఆలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.