కోనసీమ: కె.గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో చేనేత సహకార సంఘాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. అనంతరం చేనేత కార్మికులకు, గ్రామ ప్రజలకు నూతన జీఎస్టీ సంస్కరణలపై కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. జీఎస్టీ 2.0తో పేద, సామాన్యవర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.