VSP: నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. ఎండాడ, మిథిలాపురి ఉడా కాలనీ రోడ్లను పరిశీలించి, పారిశుధ్య పనుల జాప్యంపై సిబ్బందిని ప్రశ్నించారు. తొలగించిన ఫుట్‌పాత్‌లను తిరిగి ఆక్రమించిన దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.