PPM: సాలూరు పట్టణ పరిధిలో ఉన్న రామాకాలనీలో మురుగునీటి సమస్యను పరిష్కరించామని సాలూరు మున్సిపల్ కమిషనర్ రత్న కుమార్ తెలిపారు. ఈనెల 7వ తేదీన ఒక దిన పత్రికలో ప్రచురితమైన మురుగు కదలదు.. దుర్వాసన వదలదు వార్తకు మంగళవారం స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. సాలూరు పురపాలక సంఘం పరిధిలో ఎగువ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడుతుండడంతో కాలనీలోకి నీరు చేరిందన్నారు.