ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఈనెల 19న అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కార్యాలయ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులు, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, చెవి, గొంతు, ముక్కు, జనరల్ వ్యాధులకు చికిత్సలు చేసి మందులు అందిస్తారని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.