VZM: కొత్తవలస టౌన్ పరిధిలో ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని ఆర్యవైశ్య సంఘం సర్పంచ్ రామస్వామికి శుక్రవారం వినతిపత్రం అందించారు. స్మశానంలో కనీస సౌకర్యాలు లేవని, షెడ్డు కారుతుందని, అంతిమ సంస్కారాలకు నీళ్లు కూడా లేవని వివరించారు. తక్షణమే ఈ సౌకర్యాలు మెరుగుపరచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. పంచాయతీ సహకరిస్తే తాము సొంత నిధులతో షెడ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.