అనంతపురం: ములకలచెరువులో ఆదివారం అర్ధరాత్రి కన్నకొడుకే తల్లిని హత్య చేసినట్లు సీఐ రాజా రమేశ్ తెలిపారు. మంగళవారం మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి ములకలచెరువుకు చెందిన లేట్ హైదరవల్లి భార్య సఫియాబేగంకు కుటుంబ గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను ఆమె చిన్నకొడుకు రెడ్డి హత్య చేశాడు.