VZM: నేడు ఉదయం 11 గంటలకు విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం నేడు( బుధవారం) జరగనుంది. కౌన్సిల్ సమావేశం హాలులో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన పలు అంశాలతో అజెండా రూపొందించారు. కార్పొరేషన్ పరిధిలో పలు సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ప్రధానాంశంగా చర్చించనున్నారు.