SKLM: రణస్థలం మండలం పైడి భీమవరం ZPH స్కూల్లో నియోజకవర్గ స్థాయి బాల బాలికల స్కూల్ గేమ్ ఫెడరేషన్ టోర్నమెంట్, సెలక్షన్ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఇటువంటి క్రీడా సంబంధమైన కార్యక్రమాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.