Samantha Buy a Luxury Apartment:సమంత (Samantha).. వరసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా చైతన్యతో విడాకుల తర్వాత వారి గురించే చర్చ. ఇటీవల వచ్చిన శాకుంతలం డిజాస్టర్‌గా నిలిచింది. యశోద మూవీ కాస్తో కూస్తో పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం సమంత (Samantha) ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్లో ప్రియాంక చోప్రా పోషించిన రోల్లో యాక్ట్ చేస్తారు. దాంతోపాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి మూవీలో నటిస్తోంది. సినిమా హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా సమంత ముందగుడు వేస్తోంది.
సమంత (Samantha) కొత్తగా లగ్జరీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసిందని తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో గల జయభేరీ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకుందట. ఖరీదైన్ డ్యుప్లెక్స్ ఫ్లాట్ 13 లేదంటే 14వ ఫ్లోర్లో ఉందని సమాచారం. ఈ ప్లాట్ ధర రూ.7.8 కోట్లు ఉంటుందట. సమంతకు ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లు విలువ చేసే ఓ ఇల్లు కూడా ఉందట. దాంతోపాటు ముంబైలో ఓ లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్టు.. సమంత (Samantha) కెరీర్‌పై ఫోకస్ చేస్తూనే.. స్థిరాస్థులను కొనుగోలు చేస్తున్నారు.