టాలీవుడ్ (Tollywood) టాప్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీ(Industry)లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రకుల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ (Jackie Bhagnani)తో సహజీవనం చేస్తున్న విషయం అభిమానులకు తెలుసు. అయితే, ఎలాంటి అంశాలు ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నానికి దారితీస్తాయనే విషయాలను ఆమె తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది.‘ అనుబంధం విచ్ఛిన్నానికి ప్రధాన కారణం అబద్ధాలు చెప్పడమే. అనుబంధంలో చెప్పకూడని విషయం ఏదీ ఉండదు.
రిలేషన్ షిప్ (Relationship) లో ప్రాథమికంగా స్నేహితుల మాదిరే ఉండాలి. నా భాగస్వామి తప్పు చేస్తే అతడు నేరుగా ముందుకు వచ్చి అదే విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే మనమంతా మనుషులం(people). సహజంగానే తప్పులు చేస్తుంటాం. కానీ, అబద్ధాలు చెబుతూ, వాటిని మళ్లీ అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, మోసం చేయడం, భావోద్వేగపరమైన మోసం నా వరకు అస్సలు నచ్చదు’’అని రకుల్ ప్రీత్ సింగ్ వివరించింది.తన వరకు ప్రేమ అన్నది ఎలాంటి షరతులు లేకుండా ఉండాలని ఆమె వెల్లడించింది. ‘‘ప్రేమ అన్నది మౌనంలో ప్రశాంతతను వెతుక్కుంటుంది.
ఒకరినొకరు గౌరవించుకోవాలి. నేడు ప్రేమ అనే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే, వారు మనం కోరుకున్నట్టుగా చేయాలనుకుంటాం. అంతేకానీ, వారి ప్రేమను సహజంగా పరిమళించాలనుకోం. కానీ ప్రేమ అనేది మీలోని ఉత్తమ కోణాన్ని ఆవిష్కరించేదిలా ఉండాలని నేను కోరుకుంటాను’’అని రకుల్ తన అభిప్రాయాలను పంచుకుంది.రకుల్ ఫోకస్ అంతా బాలీవుడ్ (Bollywood)పైనే పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తోంది. గతేడాది ఐదు హిందీ మూవీలో నటించింది రకుల్. ఈ ఏడాది కూడా రెండు సినిమాలు చేస్తుంది. అలాగే ఆమె లీడ్ రోల్ లో నటించిన ‘బూ’ మూవీ (Boo’ movie) ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఇటీవల ఓటీటీ (OTT) వేదికగా విడుదల అయింది.