Keerthy Suresh : ఎత్తిన బాటిల్ దించని కీర్తి సురేష్.. వైరల్ వీడియో!
Keerthy Suresh : ఈనెల 30 తర్వాత మహానటి కీర్తి సురేష్ కాస్త వెన్నెలగా మారబోతోంది. న్యాచురల్ స్టార్ నానితో నటించిన దసరా మూవీ పై భారీ ఆశలే పెట్టుకుంది కీర్తి సురేష్. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదట.
ఈనెల 30 తర్వాత మహానటి కీర్తి సురేష్ కాస్త వెన్నెలగా మారబోతోంది. న్యాచురల్ స్టార్ నానితో నటించిన దసరా మూవీ పై భారీ ఆశలే పెట్టుకుంది కీర్తి సురేష్. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదట. తనను సంప్రదించే మేకర్స్‌కు దసరా తర్వాత చూద్దాం అని చెబుతోందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దసరా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే నవరాత్రి యాత్ర అంటూ.. పాన్ ఇండియా టూర్ వేసేశాడు నాని. ఇక ఈ ప్రమోషన్స్‌లో కీర్తి చేసిన పనికి.. ఓ వీడియో వైరల్‌గా మారింది. దసరా మూవీలో రియాల్టీ కోసం.. కొన్ని సీన్లలో నిజంగానే మందు కొట్టానని చెప్పాడు నాని. దాంతో ప్రమోషన్స్‌లోను మందు బాటిల్స్‌తో రచ్చ చేస్తున్నారు. తాజాగా ప్రమోషన్లో భాగంగా.. రానా, నాని ఎత్తిన బాటిల్స్ దించకుండా.. బాటమ్స్ అప్ చేసి చూపించారు. దీంతో కీర్తి కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా.. ఎత్తిన బాటిల్‌ను దించకుండా ఖాళీ చేసేసింది. మామూలుగా బాయ్స్ మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు. కానీ అమ్మాయిలు కూడా తగ్గేదేలే అన్నట్టుగా.. కీర్తి రచ్చ లేపింది. వాస్తవానికి కీర్తి తాగింది వాటరే.. కాకపోతే అమ్మడు చేసిన పని మాత్రం.. కుర్రాళ్లకు ఫుల్ కిక్ ఇస్తోంది. ట్యాగ్ దట్ గర్ల్ అంటూ.. తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే.. దసరా మూవీతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. దసరా పై భారీ అంచనాలున్నాయి.