Allu Arjun: బన్నీ, అట్లీ కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లు?
పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడు? అనే డౌట్స్ అన్నింటికి త్వరలోనే చెక్ పెట్టబోతున్నారు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ప్రాజెక్ట్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. దీంతో ఇద్దరు హీరోయిన్లు రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Allu Arjun: జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయాడు కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ. నిజం చెప్పాలంటే.. జవాన్ సినిమాను సౌత్‌లో ఏ హీరోతో తీసిన కూడా డిజాస్టర్ అయి ఉండేది. కానీ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఫామ్‌లో ఉండడం ఒకటైతే.. సౌత్ కంటెంట్ హిందీ వాళ్లకు కొత్తగా అనిపించడం.. మన సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉండడంతో.. జవాన్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఫక్తూ కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అయినటువంటి అట్లీ.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే స్పెషల్‌గా ఈ క్రేజీ కాంబో అనౌన్స్మెంట్ రాబోతోంది.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్‌లో ఒక్క ఛాన్స్ కూడా లేకుండా ఉన్న పూజా హెగ్డేని.. ఈ సినిమాలో హీరోయిన్గా అనుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. గతంలో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో సినిమాల్లో బన్నీతో రొమాన్స్ చేసింది పూజా. దీంతో మూడోసారి పూజాకు ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ కోలీవుడ్ వెర్షన్ ప్రకారం.. మహానటి కీర్తి సురేష్ ఓకె అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కీర్తి సురేష్, అల్లు అర్జున్ కలిసి నటించలేదు. దీంతో ఈ ఫ్రెష్ కాంబో మంచి ఇంట్రెస్టింగ్గా మారింది. కాబట్టి.. కీర్తికే బన్నీతో నటించే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. లేదంటే.. ఈ ఇద్దరిని ఓకె చేస్తారా? అనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.