»Hanuman Hanuman Ot Is Postponed And Why Uthutthi Posts
Hanuman: ‘హనుమాన్’ ఓటీటీ అందుకే వాయిదా.. మరి ఉత్తుత్తి పోస్టులెందుకు?
సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో ఓటిటి సంస్థతో పాటు మేకర్స్ కూడా డిసప్పాయింట్ చేస్తునే ఉన్నారు.
Hanuman: చెప్పాలంటే.. హనుమాన్ మహా శివరాత్రి సందర్బంగా ఓటీటీలోకి రావాల్సింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తీరా రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక.. అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది ఓటిటి సంస్థ జీ 5. కానీ హిందీ టెలివిజన్ డేట్ లాక్ అవడంతో.. ఓటిటి డేట్ కూడా ఫిక్స్ అయింది. మార్చి 16వ తేదీ నుంచి హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. కానీ ఈ సినిమా డిజిటల్ తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన జి 5 సంస్థ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు కదా.. అన్ని ఉత్తుత్తి పోస్టులు పెడుతోంది. సుదీర్ఘ వెయిటింగ్‌కి ఒక ఎండ్ పడింది, హనుమాన్ సినిమా త్వరలోనే జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉండబోతోంది.. అంటూ ఓ పోస్ట్ చేశారు. కానీ ఓటిటి డేట్ మాత్రం చెప్పలేదు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ ఓటిటి విషయంలో స్పందించాడు. హనుమాన్ ఓటిటి స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు.. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము.. మా ఉద్దేశ్యం మీకు ది బెస్ట్ ఇవ్వడమే తప్ప ఏం లేదు.. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.. మాకు సపోర్ట్ ఇవ్వండి.. అని పోస్ట్ చేశాడు. దీంతో.. హనుమాన్ ఓటిటిలోకి ఎప్పుడొస్తుందనే క్లారిటీ లేకుండా పోయింది.
కానీ హిందీ స్ట్రీమింగ్ 16 నుంచి ఉంది కాబట్టి.. తెలుగులోను ఇదే సమయంలో వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే.. ఇక ఓటిటి డేట్ అనౌన్స్ చేస్తారని ఎదురు చూస్తున్న ఓటిటి లవర్స్‌కి.. ప్రతీ సారి సదరు ఓటిటి సంస్థ, సినిమా దర్శకుడు ఇలాంటి పోస్టులు చేస్తూ.. మరింత డిసప్పాయింట్ చేస్తున్నారు. దీంతో.. అసలు ఇలాంటి ఉత్తుత్తి పోస్టులు ఎందుకు? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.