»Anasuya Gave A Warning That I Will Show What I Am
Anasuya: నేనేంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ!
నెట్టింట అనసూయ చేసే హడావుడి గురించి అందరికీ తెలిసిందే. తానొక ట్వీట్ చేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అయ్యి ట్రోల్స్ చేయడం, ఆ తర్వాత తన మీదే ట్రోల్ చేస్తున్నారని అనసూయ మండిపడటం ఇదంతా గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.
ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో అనసూయ(Anasuya) వార్తలు ఎక్కువగా వైరల్(Viral) అవుతున్నాయి. నెట్టింట అనసూయ చేసే హడావుడి గురించి అందరికీ తెలిసిందే. తానొక ట్వీట్ చేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అయ్యి ట్రోల్స్(Trolls) చేయడం, ఆ తర్వాత తన మీదే ట్రోల్ చేస్తున్నారని అనసూయ మండిపడటం ఇదంతా గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. కొన్నిరోజులకు ముందు అనసూయను ఆంటీ అన్నారని రచ్చ రచ్చ చేసింది.
సినిమాలు, షోలలో కాకుండా సోషల్ మీడియాలోనే అనసూయ(Anasuya) ఎక్కువగా హైలెట్ అవుతూ వస్తోంది. ఇటీవలె ఈమె విజయ్ దేవరకొండ(Vijay devarakonda)ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండ పేరుకు ముందు ‘The’ అని పెట్టుకున్నాడని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా విజయ్ కి సపోర్ట్‌గా నిలిచారు. దీంతో అనసూయకు ఏం చేయాలో తెలియక విజయ్ ఫ్యాన్స్ పై, మీడియాపై ఫైర్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ అనసూయ చేసిన ట్వీట్:
తాజాగా అనసూయ(Anasuya) తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. నువ్వు ఎవరో నీకు తెలుసు, నీ తప్పు నువ్వు తెలుసుకునే వరకూ నేను ఇలాగే చేస్తుంటా. నా విషయంలో ఏదైతే చేశావో దాన్ని నీకు ప్రతిసారీ గుర్తు చేస్తూనే ఉంటా. దీనివల్ల నాకు బాగా నెగిటివిటీ వస్తుందని తెలుసు. అయినా నేను నిజం, మంచితనం, భగవంతుడిపై నమ్మకం ఉంచాను. ఏడ్చి సానుభూతి పొందే వ్యక్తిని కాదు. నన్ను ఎంత కిందకు లాగినా, నా మీద ఎంత బురద చల్లినా ఇలాగే ఫైట్ చేస్తుంటాను.
వీటన్నిటికీ అర్ధం చెప్పే ఒక రోజు వస్తుందని నమ్ముతున్నాను. నాకు పని లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నాను అనుకోకండి. ఇది కూడా నా భాద్యత. నువ్వు నాలోని ఓ తల్లిని టార్గెట్ చేశావు. ఆ తల్లి ఎంత ధైర్యవంతురాలో నీకు చూపిస్తా అని అనసూయ(Anasuya) పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్నింగ్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ(Vijay devarakonda), అతని ఫ్యాన్స్ కి అని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ కు విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్స్(Trolls) చేస్తున్నారు.
‘Morning tweeple!! Felt this is the right way to “wake up” many 😊 This! I personally don’t know a lot of my extended fam page admins.. but I am super proud of the influence I create unlike many others’ ! Not worth the comparison at all.. but this is an option too ani cheptunna.. pic.twitter.com/Gimro8EnPW