Pawan Kalyan : ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజు రోజుకి లేట్ అవుతునే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లునే ఫస్ట్ స్టార్ట్ చేశారు పవన్. కానీ ఈ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్.
ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజు రోజుకి లేట్ అవుతునే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లునే ఫస్ట్ స్టార్ట్ చేశారు పవన్. కానీ ఈ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. హరిహరవీరమల్లు షూటింగ్ మొదలై రెండున్నరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవడం లేదు. అసలు ఈ సినిమా లైన్లో ఉందా.. లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. వినోదయ సీతమ్ రీమేక్ షూటింగ్.. అలా మొదలు పెట్టారో లేదో.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. జులై 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో హరి శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత వెంటనే సుజీత్ ‘ఓజి’ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ జరుపుకునేందుకు రెడీ అవుతున్నాయి. కానీ హరిహరవీరమల్లు షూటింగ్ అప్డేట్ మాత్రం రావడం లేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తునే ఉన్నారు. అసలు ఈ సినిమానే ఎందుకు లేట్ అవుతుందనేది అర్థం కాకుండా పోతోంది. దీంతో పాటే మొదలు పెట్టిన భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయింది.. ఇక ఇప్పుడు మరో మూడు సినిమాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. దాంతో క్రిష్ వల్ల హరిహర వీరమల్లు డిలే అవుతోందా.. లేదంటే పవన్ డేట్స్ అడ్జెస్ట్మెంట్ అవడం లేదా.. కాదంటే నిర్మాణ సంస్థ కరెక్ట్‌గా ప్లాన్ చేయలేకపోతోందా.. అనేది తెలియకుండా ఉంది. కానీ ప్రజెంట్ పవన్ నటిస్తున్న సినిమాల్లో.. దీనిపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా అండ్ పీరియాడికల్ డ్రామా ఇదే. మరి ఈ ఏడాదైనా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.