»Veera Simha Reddy Beauty Honey Rose Comments On Love And Marriage
Honey Rose: పెళ్లి, ప్రేమ గురించి హనీరోజ్ కామెంట్స్ వైరల్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా వీరసింహారెడ్డి(Veerasimhareddy) సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా మలయాళీ భామ హనీరోజ్(Honey Rose) నిలిచింది. తన అందచందాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. 2005లో బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. 2008లో ఆలయం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళ సినిమాల్లోనూ కనిపించింది. అయితే అవేవీ తనకు అంతగా గుర్తింపునివ్వలేదు.

బాలకృష్ణ(Balakrishna) సినిమా వీరసింహారెడ్డి సినిమాతో హనీరోజ్(Honey Rose) మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె పలు ఈవెంట్లలో పాల్గొంటూ వస్తోంది. హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కు హనీరోజ్ ను ఆహ్వానించారు. ఆ ఈవెంట్లో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని మీడియా అడగ్గా అందుకు హనీరోజ్(Honey Rose) బదులిచ్చింది.
పెళ్లి అనేది ఓ బాధ్యత అని, అందుకే ప్రతి విషయాన్ని కూడా తాను ప్రేమిస్తానని, అంత వరకే వెళ్తానని చెప్పింది. ప్రస్తుతం పెళ్లి, ప్రేమపై హనీరోజ్(Honey Rose) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరసింహారెడ్డి(Veerasimhareddy) సినిమాలోని తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపింది. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో అభిమానిస్తున్నారని, త్వరలో మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించనున్నట్లు హనీరోజ్(Honey Rose) వెల్లడించింది.
నటన అంటే తనకు చాలా ఇష్టమని, సినిమాలు తప్పా తనకు మరో ప్రపంచం తెలియదని హనీరోజ్(Honey Rose) తెలిపింది. కేరళ వంటకాలను తాను బాగా ఇష్టంగా తింటానని, హైదరాబాద్(Hyderabad)లోని బిర్యానీ రైస్, పెరుగు బాగా నచ్చుతాయని తెలిపింది. సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ..అందులో మంచీచెడూ అనేవి రెండూ ఉంటాయని, తాను ఏదీ పట్టించుకోనని హనీ రోజ్(Honey Rose) తెలిపారు.