»Mega Power Movie First Look Released By Director Meher Ramesh And Bobby
Mega Power: ‘మెగా పవర్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా పవర్(Mega Power) చిత్రం ఫస్ట్ లుక్(first look) పోస్టర్ ను మేరక్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఓ థియేటర్లో ముఠా మేస్త్రీ సినిమా కటౌట్లో చిరంజీవి కనిపిస్తున్నారు.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(ram charan) పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్(Mega Power) చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్లో ఓ థియేటర్లో ముఠా మేస్త్రి సినిమాలో చిరంజీవి కటౌట్ ఉండటం చూడవచ్చు. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(mega star chiranjeevi) చిత్రానికి స్కూల్ పిల్లలు, ఓ చిన్నారిని ఎత్తుకున్న తల్లి సహా పలువురు సైకిళ్లపై రావడం గమనించవచ్చు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మాతలుగా ఉన్నారు.
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్(ram charan) పుట్టినరోజును పురస్కరించుకుని దర్శకులు మెహర్ రమేష్, కె.ఎస్ రవీంద్ర (బాబీ) ఫస్ట్ లుక్(first look)ను విడుదల చేశారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవిగారి మీద ఫస్ట్ లుక్‌ను విడుదల చేశామని దర్శకనిర్మాతలు తెలిపారు. మేం అడగ్గానే బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మెహర్ రమేశ్, బాబీ మా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారని పేర్కొన్నారు.
చరణ్ పుట్టిన రోజున మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే మెగా ఫ్యామిలీ(mega family) హీరోల సపోర్ట్‌తో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మెగా పవర్ మూవీ మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.