Ram Charan: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ అదుర్స్
రామ్ చరణ్(Ram Charan) 15వ చిత్రం టైటిల్ రివీల్ చేసిన తర్వాత తాజాగా గేమ్ ఛేంజర్(Game Changer) ఫస్ట్ లుక్(first look) విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతను బైక్‌పై కూర్చుని గజిబిజి జుట్టు, గడ్డంతో క్రేజీగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా గేమ్ ఛేంజర్(Game Changer) టీమ్ చెర్రీ ఫస్ట్ లుక్(first look) పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ బైక్ పై కూర్చుని వెనుకకు చూస్తున్న లుక్ లో క్రేజీగా కనిపిస్తున్నారు.
ఆ క్రమంలో చేతికి వాచ్, ఒక వేలికి ఉంగరం ధరించి స్టైలిష్ గా ఉన్నారు. అంతేకాదు ఫంకీ హెయిర్ స్టైల్ సహా గుబురు గడ్డంతో చెర్రీ రగ్డ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. ఇది చూసిన చెర్రీ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మరికొంత మంది అభిమానులైతే కల్ట్ రోల్ లోడెడ్, సూపర్, అదిరింది లుక్, వావ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తుండగా..దిల్ రాజు నిర్మిస్తున్నారు.
2019లో విడుదలైన వినయ విధేయ రామ చిత్రం తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీలు చేస్తున్న రెండో చిత్రం ఇది. ప్రముఖ నటుడు-చిత్ర నిర్మాత ఎస్జే సూర్య ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. జయరామ్, అంజలి సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. తిర్రు, ఆర్.రత్నవేలు ఈ చిత్రానికి కెమెరా క్రాంక్ చేస్తున్నారు. షమీర్ మహమ్మద్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
I couldn’t have asked for a better birthday gift !! #GameChanger