పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు.. భోళా శంకర్‌గా ఆడియెన్స్ ముందుకు వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi). చాలా కాలం తర్వాత వచ్చిన ఛాన్స్‌ను యూజ్ చేసుకొని ఎట్టిపరిస్థితుల్లోను సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ఆశతో మెహర్ రమేష్(meher ramesh) ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఇప్పుడు మెహర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు మెగాఫ్యాన్స్. అంతేకాదు..భోళా శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా షాకింగ్‌గానే ఉన్నాయి.
మెగాస్టార్(chiranjeevi) నుంచి వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. భోళా శంకర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ మెహర్ రమేష్(meher ramesh) డైరెక్టర్ కావడం ఒకటైతే.. రీమేక్ సినిమా కావడం, వేదాళం హిట్ అయినా ప్రస్తుతానికి అది ఔట్ డేటెడ్ కథ కావడంతో.. అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది భోళా శంకర్. అంతేకాదు.. మెహర్ రమేష్‌తో పాటు మెగాస్టార్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. అసలు ఖుషి నడుము సీన్‌ను మెగాస్టార్ రీ క్రియేట్ చేయడం ఏంటి? అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? అనేది మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది భోళాశంకర్(Bhola Shankar). దీంతో ఫస్ట్ షో, నైట్ షోకి బుకింగ్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. దీని ఫలితం ఓపెనింగ్స్ పై గట్టిగానే పడినట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు షేర్ 15 కోట్ల రూపాయల లోపే ఉంటుందని తెలుస్తోంది. కానీ ఎలాంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన జైలర్ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. డే వన్ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్లకు పైగా షేర్.. 12 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కానీ భోళా శంకర్ మాత్రం రజనీ కాంత్(rajinikanth)కు డబుల్ కూడా ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాడు. ఇంతకు ముందు వచ్చిన రీమేక్ మూవీ గాడ్ ఫాదర్ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడీ కలెక్షన్లను భోలా శంకర్ బీట్ చేసిన.. వాల్తేర్ వీరయ్యను టచ్ చేయలేయలేకపోయాడు.
ఈ సినిమా ఇండియాలో డే వన్ 23 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టింది. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్(collections) చూస్తే.. ఐదో వంతు కూడా రాలేదు. కాబట్టి.. ఆచార్య కంటే దారుణమైన డిజాస్టర్‌గా భోళా శంకర్ నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్గా నటించగా.. మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్, సుశాంత్ కీ రోల్ ప్లే చేశాడు. ఇక జబర్డస్త్ బ్యాచ్గెటప్ శ్రీను, హైపర్ ఆదితో పాటు శ్రీముఖి కూడా కీలక పాత్రలు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు.. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఇచ్చాడు.