టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం పక్కన ఓ రేంజ్ లో నటించి కోవై సరళ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో వీరిద్దరీ కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. డైరెక్టర్లు కూడా వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ తెలుగు సినిమాల వైపు అస్సలు చూడటం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమంటోంది. తాజాగా ఆమె నటించిన తమిళ మూవీ ”సెంబి” తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి రానుంది. డిసెంబర్ 30వ తేదిన ఈ సినిమా విడుదలై విమర్శకుల దగ్గరి నుంచి ప్రశంసలు అందుకుంది.
ఫిబ్రవరి 3వ తేది నుంచి ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రభు సాల్మన్ ఈ సినిమాను ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఇదొక అటవీ ప్రాంతంలో సాగే కథ. తన మనవరాలితో జీవిస్తున్న ఓ బామ్మ తేనె అమ్ముకుంటూ బతుకుతుంటుంది. అయితే తన మనవరాలిపై ఓ పొలిటికల్ లీడర్ కొడుకు, తన ఫ్రెండ్స్ కలిసి అత్యాచారం చేస్తారు. బామ్మ తన మనవరాలికి న్యాయం జరగడం కోసం పోరాడుతూ వారిపై పగ తీర్చుకుంటుంది. ఇందులో కోవై సరళ అద్భుతంగా నటించింది. కామెడీ పాత్రల్లో కనిపించే ఆమె ఇందులో ఎమోషనల్ గా నటించి అందరి చేత ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.