మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) హీరోగా రామబాణం సినిమా(Ramabanam Movie) తెరకెక్కుతోంది. ఈ మూవీకి శ్రీవాస్(Srivaas) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను రూపొందిస్తోంది. మూవీలో గోపీచంద్ కు జోడీగా డింపుల్ హయతి(Dimple Hayati) కనిపించనుంది. రామబాణం సినిమాకు మిక్కీ జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మే 5వ తేదిన రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
రామబాణం మూవీ ట్రైలర్:
తాజాగా రామబాణం సినిమా(Ramabanam Movie) ట్రైలర్ లాంచ్(Trailer Launch) ఈవెంట్ రాజమండ్రిలో వేడుకగా జరిగింది. మూవీ ట్రైలర్(Trailer Release) అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేసే జగపతిబాబు(Jagapatibabu)ను దెబ్బతీయడానికి విలన్ చేసే ప్రయత్నాలు వాటి మధ్య కథ నడుస్తుంది. జగపతి బాబును సపోర్టు చేసే తమ్ముడి పాత్రలో గోపీచంద్(Gopichand) కనిపించనున్నాడు.
విలన్ బారి నుంచి తన అన్న జగపతిబాబు(Jagapatibabu)ను ఎలా కాపాడుకుంటాడనేదే రామబాణం సినిమా(Ramabanam Movie) కథాంశం. ట్రైలర్(Trailer)లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలుతూ సీన్స్ కట్ చేసి రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ రామబాణం ట్రైలర్ ను రిలీజ్(Trailer Release) చేశారు. ఈ సినిమా శ్రీవాస్(Srivaas), గోపీచంద్(Gopichand) కాంబోలో మూడోది కావడం విశేషం. ట్రైలర్(Trailer) సినిమాపై అంచనాలను పెంచేలా చేస్తోంది.