టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో శ్రీవిష్ణు(Srivishnu) నటిస్తోన్న చిత్రం సామజవరగమన(Samajavaragamana). వైవిధ్యభరిత స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీని రాజేష్ దండ నిర్మిస్తున్నారు. సామజవరగమన మూవీకి రామ్ అబ్బరాజు(Ram Abbaraaju) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. మే 18వ తేదీన ఈ మూవీని రిలీజ్(Release) చేయనున్నారు.
‘సామజవరగమన’ చిత్రం నుంచి విడుదలైన లిరికల్ సాంగ్:
తాజాగా సామజవరగమన(Samajavaragamana) సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ (Lyrical Video Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(release) చేసింది. ”ఏం బోర్ కొట్టిందో” అంటూ ఈ పాట(song) సాగుతుంది. ఇందులో హీరో మందుకొట్టి తన స్నేహితులతో కలిసి చిందులేస్తూ పాట పాడుకుంటాడు. గోపీసుందర్(Gopisundar) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు.
సామజవరగమన మూవీ(Samajavaragamana Movie)లో వెన్నెల కిశోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘రాజరాజచోర’ సినిమా తర్వాత శ్రీవిష్ణు(Srivishnu)కు ఏ సినిమా విజయవంతం కాలేదు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా పాట(Movie Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.