»Rakshasa Raju Film Effect After Ahimsa Negative Talk
Rakshasa Raju ఇక కష్టమే.. అహింస నెగటివ్ టాక్‌తో పట్టాలెక్కడం డౌటే
దగ్గుబాటి అభిరామ్ తెరంగ్రేటం చేసిన అహింస మూవీకి నెగిటివ్ టాక్ వస్తోంది. దీంతో డైరెక్టర్ తేజ తదుపరి మూవీ రాక్షస రాజుపై ప్రభావం పడింది. రానాతో చేసే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లడం కష్టమేనని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Rakshasa Raju Film Effect After Ahimsa Negative Talk
Rakshasa Raju: దర్శకుడు తేజ (teja)- రానా (rana) కాంబినేషన్లో నేనే రాజు నేనే మంత్రి మూవీ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్లీ వారి కాంబినేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంది. అభిరామ్‌తో (Abhiram) అహింస తర్వాత రానాతో (rana) రాక్షసరాజు సినిమా చేస్తానని తేజ చెబుతున్నారు. అహింస మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో రాక్షసరాజు పట్టాలెక్కడం కష్టమే అవుతుంది.
అహింస మూవీ అంతగా ఆకట్టుకోలేదు. మొత్తం నెగిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా తగ్గాయి. అహింస సక్సెస్ అయితే తర్వాత రానాతో (rana) తేజ రాక్షస రాజు అనే మూవీ చేసేవారు. ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కడం కష్టమే అనిపిస్తోంది. రాక్షసరాజు మూవీని చాలా రోజుల క్రితమే తేజ ప్రారంభించగా.. వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా తప్పేలా లేదు. అహింస మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తేజ.. తన తదుపరి చిత్రం రాక్షస రాజు అని ప్రకటించారు. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి మూవీ చేస్తానని తెలిపారు.
అహింస మూవీని జెమినీ కిరణ్ (gemini kiran) తీశారు. రాక్షస రాజును సురేష్ బాబు తీస్తానని ప్రకటించారు. అహింస ఎఫెక్ట్ తేజ నెక్ట్స్ సినిమాపై పడుతుంది. సో.. ఆ సినిమా సెట్స్ మీదకు రావడం కష్టమే అవుతుంది. ఒకవేళ సురేష్ బాబు అంగీకరించినా.. స్క్రిప్ట్ విషయంలో ఆయనను తేజ (teja) సంతృప్తి పరచాలి. లేదంటే ఆ సినిమా జరగడం కష్టమే అవుతుంది. నేనే రాజు.. నేనే మంత్రి తప్ప ఇటీవల తేజ తీసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. కెరీర్ తొలినాళ్లలో తీసిన చిత్రం, నువ్వు నేను, జయం మాత్రమే సక్సెస్ అయ్యాయి.