Director Bobby: రజనీ కాంత్ రిజెక్ట్.. బాలయ్య సై.. ఇంప్రెస్ చేసిన బాబీ?
ప్రతి కథ అందరికీ నచ్చాలని లేదు. ఓ హీరో చేయాల్సిన సినిమాను.. మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామన్. ఇప్పుడు బాలయ్య విషయంలోను ఇదే జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ రిజెక్ట్ చేసిన కథతో.. బాలయ్యను ఇంప్రెస్ చేసి.. అనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నాడట బాబీ.
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు నందమూరి నటసింహాం బాలకృష్ణ. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా NBK108 టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. బాలయ్య పుట్టినరోజుకి రెండు రోజులు ముందుగానే టైటిల్ ప్రకటించానున్నారు. ఈ సినిమాకు ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే బాలయ్య బర్త్ డేకి ఒక్క టైటిల్ మాత్రమే కాదు.. డబుల్ డోస్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త సినిమా అప్డేట్లు కూడా రానున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ బాబీతో బాలయ్య ఓ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు తెలుస్తోంది.
పోయిన సంక్రాంతికి బాలయ్యకు పోటీగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు బాబీ. ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు బాబీ. అయితే ఆ మధ్యలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు బాబీ ఓ కథ చెప్పాడని.. అది ఆయనకు బాగా నచ్చిందని వినిపించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రజనీ కాంత్ ఈ కథను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే కథను బాలయ్యకు చెప్పగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాను సితార ఎంటర్ట్మైన్మెంట్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించనున్నట్టు టాక్. అందుకే జూన్ 10న బిగ్ అప్డేట్ రానున్నట్లు.. అసలు మ్యాటర్ చెప్పకుండా ఓ ట్వీట్ వేశాడు నాగవంశీ. అయితే.. బోయపాటి సినిమా తర్వాతే బాబి మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. జూన్ 10న బాలయ్య, బోయపాటి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి రజనీ రిజెక్ట్ చేసిన కథతో.. బాలయ్య, బాబీ ఏం చేస్తారో చూడాలి.