Pawan Kalyan : గబ్బర్ సింగ్ తర్వాత 'భవధీయుడు భగత్‌సింగ్' అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. కానీ ఆ తర్వాత.. ఈ సినిమా టైటిల్ కాస్త ఉస్తాద్ భగత్‌సింగ్‌గా మారింది. టైటిలే కాదు.. కథ కూడా మారిందనే టాక్ ఉంది. ఈ సినిమా తమిళ్ మూవీ 'తేరీ' రీమేక్‌గా తెరకెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.
గబ్బర్ సింగ్ తర్వాత ‘భవధీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. కానీ ఆ తర్వాత.. ఈ సినిమా టైటిల్ కాస్త ఉస్తాద్ భగత్‌సింగ్‌గా మారింది. టైటిలే కాదు.. కథ కూడా మారిందనే టాక్ ఉంది. ఈ సినిమా తమిళ్ మూవీ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీని పై క్లారిటీ ఇస్తానని చెబుతున్నాడు హరీష్ శంకర్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలియడం లేదు. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయినా ఇప్పటి వరకు హీరోయిన్ మ్యాటర్ తేల్చడం లేదు. ముందు నుంచి ఈ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్గా అనుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఫిక్స్ అయిందనే టాక్ నడిచింది. అయితే అమ్మడిని సుజీత్ ‘ఓజి’ కోసం తీసుకున్నారనే ప్రచారం జరిగింది. దాంతో వపన్‌తో శ్రీలీల ఫిక్స్ అయింది.. కానీ ఏ సినిమాలో అనేదే క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఉస్తాద్ భగత్‌సింగ్‌లో ప్రభాస్ హీరోయిన్ను ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. మళయాళి ముద్దుగుమ్మ మాళవికా మోహనన్.. పవన్‌తో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఈ బ్యూటీ విజయ్ ‘మాస్టర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం అయింది. ప్రస్తుతం ప్రభాస్, మారుతి సినిమాలో.. ముగ్గురిలో ఓ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇప్పుడు పవన్‌తో ఛాన్స్ అందుకుందని అంటున్నారు. అయితే ఉస్తాద్‌లో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్, మాళవిక సెకండ్ హీరోయిన్ అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరి ఫైనల్‌గా పవన్‌తో ఎవరు రొమాన్స్ చేస్తారో చూడాలి.