టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనను ఫ్యాన్స్ అభిమానులుగా కంటే భక్తులుగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఆయనను ఓ దేవుడిలా పిలుస్తుంటారు. ఆయన నిజంగా తన కొత్త సినిమాలో దేవుడిగా కనిపించనున్నాడు.
పవన్ కళ్యాణ్ తన మేనలుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న సినిమా బ్రో. సముద్రకణి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా పవన్, తేజ్ కలిసి ఉన్న పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ పోస్టర్ లో హైలైట్ గా నిలిచాయి పవన్ షూస్. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబోలో ఉన్న ఈ షూస్ ప్రస్తుతం కుర్రకారును తెగ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆ షూస్ రేట్ ఎంత అని సెర్చ్ చేసి ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. అవి బాల్మైన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన షూస్.. వాటి విలువ అక్షరాలా.. లక్షా ఆరువేల డెబ్భై రూపాయలు. దేవుడా.. షూస్ కు ఎందుకు బ్రో అంత ఖర్చు అని అభిమానులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇక ఈ షూస్ ఉన్న ఫోటోను డైరెక్టర్ సాయి రాజేష్ షేర్ చేస్తూ.. ‘‘ఇవే షూస్ మనం వేసుకొంటే.. భోగి రోజు వీధుల్లో నడిచిన ఫీలింగ్ వస్తుంది” అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ షూస్ నెట్టింట వైరల్ గా మారాయి.