సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యనే పవర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 షోలో సందడి చేశారు. ఈ సెలబ్రిటీ టాక్ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలిప్రేమ మూవీకి రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోలేదని బాలయ్య ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. సినిమా షూటింగ్ సమయంలో తనకు ఏమి ఇవ్వలేదని, కానీ సినిమా హిట్ అయ్యాక మాత్రం మొత్తం అమౌంట్ ఇచ్చినట్లు తెలిపాడు.
ఆ తర్వాత.. కనీసం గబ్బర్ సింగ్ సినిమాకైనా రెమ్యునరేషన్ ఇచ్చారా అని బాలయ్య అడగడంతో పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం చెప్పాడు. తాను అనుకున్నంత ఇవ్వలేదు కానీ నిర్మాత అనుకున్నంత ఇచ్చారని తెలిపాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్మాత బండ్ల గణేష్ పై విరుచుకుపడుతున్నారు. పరమేశ్వర.. పవనేశ్వర.. అంటూ రెమ్యునరేషన్ కి బొక్క పెట్టావా? అందరూ అతి చేసి బొక్క పెట్టే వాళ్లేనని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. కనీసం సగం రెమ్యునరేషన్ అయినా ఇచ్చావా? అంటూ బండ్ల గణేష్‌ను చెడుగుడు ఆడుకున్నారు.
పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అని చెప్పుకుంటూ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ హ్యాండ్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో బండ్ల గణేష్ కూడా ఆ కామెంట్స్ కు రిప్లై ఇచ్చాడు. “తెలిసి తెలియకుండా మాట్లాడకు ఎర్రి….!” అంటూ బండ్ల గణేష్ ఆ కామెంట్లకు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.