Pawan Kalyan : జెట్ స్పీడ్‌లో ఉన్న పవన్.. కానీ ‘హరిహర వీరమల్లు’ కష్టమే!?
Pawan Kalyan : ఏ ముహూర్తాన దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడో గానీ.. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. వాస్తవానికి ఈ సమ్మర్లోనే ఈ పీరియాడికల్ ఫిల్మ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రాజకీయంగా పవన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు.
ఏ ముహూర్తాన దర్శకుడు క్రిష్ ‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడో గానీ.. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది. వాస్తవానికి ఈ సమ్మర్లోనే ఈ పీరియాడికల్ ఫిల్మ్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రాజకీయంగా పవన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. ఇక ఇప్పుడు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టి క్రిష్‌ను ‘హరిహరా..’ అనేలా చేశాడు. కానీ సముద్రఖని మాత్రం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఫిబ్రవరి ఎండింగ్లో వినోదాయ సీతమ్ రీమేక్ స్టార్ట్ చేశారు పవర్ స్టార్. ఈ సినిమా స్టార్ట్ చేయడమే ఆలస్యం అన్నట్టు.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఏకదాటిగా గ్యాప్ లేకుండా కొట్టేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పవన్ 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చారు. అందుకే స్పీడ్‌గా షూట్ చేస్తున్నట్టు టాక్. దాంతో పవన్ కెరియర్లో అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం ఇదే అంటున్నారు. అలాగే.. హరిహర వీరమల్లు కంటే ముందే.. ఈ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా వెనకాలే పరుగులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు సుజీత్, హరీష్ శంకర్. వినోదయ సీతమ్ అయిపోయిన వెంటనే.. ఏప్రిల్ 5 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. దాదాపు పది రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ ఉంటుందని టాక్. ఇక ఆ వెంటనే మరో పది రోజులు సుజీత్ ‘ఓజి’ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన హరిహర వీరమల్లు ఇప్పట్లో కంప్లీటయ్యే సూచనలు కనిపించడం లేదు. మరి ఈ సినిమాకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.