Jr Ntr : ‘ఆస్కార్’ ఫాలో అవుతున్న ఏకైక హీరో ఎన్టీఆర్!
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకున్న తర్వాత.. మన దేశంలోను ఆస్కార్ గురించిన వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. అకాడమీ అవార్డులకు సంబంధించి రోజుకోవార్త ఇండియన్ మీడీయలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆస్కార్ అఫీషియల్‌గా ఇన్ స్ట్రాగ్రామ్లో ఫాలో అయ్యే ఇద్దరు ఇండియన్ హీరోలు వీళ్లేనంటు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకున్న తర్వాత.. మన దేశంలోను ఆస్కార్ గురించిన వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. అకాడమీ అవార్డులకు సంబంధించి రోజుకోవార్త ఇండియన్ మీడీయలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఆస్కార్ అఫీషియల్‌గా ఇన్ స్ట్రాగ్రామ్లో ఫాలో అయ్యే ఇద్దరు ఇండియన్ హీరోలు వీళ్లేనంటు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. వారిలో ఒకరు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కాగా.. మరొకరు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండియాలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అయినా ఆస్కార్ ఇన్స్టాగ్రామ్ షారూఖ్, ఎన్టీఆర్‌నే ఫాలో అవుతుండం విశేషం. వీళ్లనే ఎందుకు ఫాలో అవుతుంది అనేది అర్థం కాని విషయమే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏదేమైనా, ఆస్కార్ అఫీషియల్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత మంది ఇంపార్టెంట్ యాక్టర్స్‌ను మాత్రమే ఫాలో అవుతుందన్నది మాత్రం నిజం. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది స్టార్లను ఫాలో అయ్యే ఆస్కార్.. ఇండియా నుంచి ఫాలో అవుతున్న ఇద్దరు హీరోలలో ఒకరు తెలుగు వాడు కావడం.. టాలీవుడ్ కు దక్కిన గౌరవం అనే చెప్పాలి. ఇప్పటికే ఆస్కార్ గెలుపుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ మోస్ట్ మెన్షన్డ్ మెన్స్ లిస్ట్‌లోను తారక్‌దే ఫస్ట్ ప్లేస్. ఆస్కార్ వేదిక పై కూడా ఎన్టీఆర్ బొమ్మే వేశారు. ఇక ఇప్పుడు ఆస్కార్ ఎన్టీఆర్‌ను ఫాలో అవడం విశేషం. ప్రస్తుతం ఈ న్యూస్ నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది.