Jr.NTR : ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత.. తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. గ్లోబల్ స్టార్డమ్ అందుకున్నాడు తారక్. అందుకే నెక్స్ట్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత.. తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో.. గ్లోబల్ స్టార్డమ్ అందుకున్నాడు తారక్. అందుకే నెక్స్ట్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఫైనల్‌గా ఇటీవలె గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది ఎన్టీఆర్ 30. ఇక ఎట్టకేలకు శ్రీరామనవమి సందర్భంగా.. షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. it’s time… #NTR30 starts rolling from tomorrow అంటూ ప్రకటించారు. మార్చి 31 నుంచి యంగ్ టైగర్ ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవనున్నాడు. దీంతో టైగర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అనుకున్న సమయానికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఈసారి తన సినిమాలో మృగాలే ఎక్కువని చెబుతున్నాడు. కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్లో భయమంటే ఏంటో తెలియని, భయంకరమైన మృగాలను భయపెట్టే వాడే తన హీరో అని.. అంచనాలను పెంచేశాడు. దాంతో ఎన్టీఆర్ 30 ఊహకందని విధంగా, విజువల్ వండర్‌గా రాబోతోందని చెప్పొచ్చు. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టీమ్‌ని రంగంలోకి దింపేశాడు. ఫస్ట్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఎన్టీఆర్ 30తో కొరటాల బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.