ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య.. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి వస్తున్న ప్రాజెక్ట్ పై పెద్దగా బజ్ లేదు.. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.
చాలా కాలం తర్వాత మెహర్ రమేశ్ డైరెక్షన్ చేస్తున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’ రిమేక్‌గా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తోంది. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కాస్త డైలమాలో ఉన్నారు మెగాఫ్యాన్స్. కానీ తాజాగా సాలిడ్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మే డే సందర్భంగా భోళా శంకర్ నుంచి అదిరిపోయే పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించబోతున్నట్లుగా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు.
ఈ లుక్‌లో వింటేజ్ చిరంజీవిని చూసినట్లుగా ఉందని అంటున్నారు మెగాభిమానులు. మెగాస్టార్ స్టైలిష్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో బోళా శంకర్ పై కాస్త పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది. ఇక ఈ సినిమాను ముందుగా సమ్మర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ అవడంతో ఆగష్టులో రిలీజ్ అన్నారు. అయినా ఎందుకో.. దసరా సందర్భంగా భోళా శంకర్ రిలీజ్ ఉంటుందనే టాక్ వినిపించింది. కానీ ఫైనల్‌గా మరోసారి ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని క్లియర్ కట్‌గా చెప్పేశారు. జూన్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి.. ఎట్టి పరిస్థితుల్లోను అనుకున్న సమయానికే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి భోళా శంకర్‌తో మెగాస్టార్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.