Nikhil : నిఖిల్‌కు కొత్త టెన్షన్.. భయపడుతున్నాడా!?
యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన '18 పేజెస్'తోను పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నిఖిల్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లోను నిఖిల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలో.. నెక్స్ట్ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు నిఖిల్. కానీ ఏజెంట్ సినిమా రిజల్ట్ చూసి భయపడుతున్నాడట నిఖిల్.
నిఖిల్(Nikhil) హీరోగా ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ‘స్పై’ అనే సినిమా(Spy Movie) చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అందుకు తగ్గట్టే.. నాన్-థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు 40 కోట్ల డీల్ కుదిరినట్లు టాక్. ఈ లెక్కన ‘స్పై’ మూవీ పై అంచనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏజెంట్ సినిమా(Agent Mobvie) రిజల్ట్ నిఖిల్‌ను కాస్త టెన్షన్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా రూపొందింది. అయితే నిఖిల్ మూవీ కూడా ‘స్పై’ బ్యాక్ డ్రాప్లోనే తెరకెక్కుతోంది. అందుకే ఏజెంట్ ఫలితం చూశాక.. నిఖిల్ టీమ్‌లో కొత్త టెన్షన్ మొదలయ్యిందనే టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. ఏజెంట్ విషయంలో జరిగిన మిస్టేక్స్ చేయకుండా.. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట నిఖిల్. అందుకే నిఖల్ ‘స్పై’ మూవీని సీరియస్‌గా తీసుకున్నట్టు టాక్. అన్నట్టు ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ చేసుకోలేదు. మరి స్పైగా నిఖిల్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.