మిమిక్రీ ఆర్టిస్ట్(Mimicry Artist)గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్(Karthik) జబర్దస్త్(Jabardasth)లోకి ఎంటరై మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీమ్ లీడర్(Team Leader)గా ఎదిగాడు. ఆ తర్వాత కెవ్వు కార్తీక్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ షో ద్వారా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇతర షోలు, సినిమాల్లో కూడా నటిస్తూ సినీ కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు.
ఇటీవలె కెవ్వు కార్తీక్ వివాహం(Kevvu Kartheek Wedding) చేసుకోనున్నట్లు ప్రకటించాడు. గురువారం కార్తీక్ పెళ్లి సినీ సెలబ్రిటీల మధ్య వేడుకగా సాగింది. కార్తీక్ వివాహానికి పలు సినీ సెలబ్రిటీలు(Celebrities) హాజరయ్యారు. జబర్దస్త్ షో(Jabardasth Show) నుంచి కమెడియన్స్ అందరూ కెవ్వు కార్తీక్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమాలు, షోలతో బిజీగా ఉన్న కార్తీక్ వివాహాన్ని చూసేందుకు బంధుమిత్రులతో పాటు బుల్లితెర ఆర్టిస్టులు కూడా హాజరయ్యారు.
కెవ్వు కార్తీక్ పెళ్లి(Kevvu Kartheek Wedding) గురువారం జరగ్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వైరల్(Photos viral) అవుతున్నాయి. పలువురు అభిమానులు, సెలబ్రిటీలు(Celebrities), నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కెవ్వు కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.