అనుకున్న సమయానికి కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి.. ఆ తర్వాత పూర్తిగా పొలిటికల్‌గా బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan). ప్రస్తుతం పవన్ చేతిలో హరిహరి వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్, బ్రో, ఓజీ సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో పవన్ ఫస్ట్ ప్రయారటీ ఫిల్మ్ ఏదైనా ఉందా.. అంటే అది ఓజి(OG)నే అని చెప్పాలి.
ముహూర్తం నుంచే ఓజి(OG) సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. మేకింగ్ స్టిల్స్, పవన్ స్టైలిష్ లుక్స్ రివీల్ చేస్తు పవర్ స్టార్(pawan kalyan) ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు. పైగా ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. డీవివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను.. యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.
ముంబైలో స్టార్ట్ అయిన ఓజి షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. తాజాగా మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఓజి లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్(hyderabad)లో జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్లో జాయిన్ అయినట్టుగా.. సాలిడ్ పోస్టర్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మేకర్స్. #OG enters the set.. An action-packed schedule is underway, filled with style, mass and energy.. అంటూ తెలిపారు. ఇక ఈ ఫోటోలో పవర్ స్టార్‌ను చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. వైట్ అండ్ వైట్‌లో స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లుక్ ఓరేంజ్‌లో ఉంది.
అది చూసిన తర్వాత.. ఇదెక్కడి మాస్ రా మావా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఓజి(OG) లేటెస్ట్ షెడ్యూల్ అయిపోగానే.. వెంటనే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో జాయిన్ అవనున్నారు పవర్ స్టార్. ప్రస్తుతం హరీష్ శంకర్ భారీ సెట్టింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక బ్రో మూవీ జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది.