టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మందికిపైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించాడు. తాజాగా మరో ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ఆ చిన్నారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు.
Kranti Kumar aged 7yr had been diagnosed with Complex congenital heart Disease-Tetralogy of Fallot with RVOT stenosis , Underwent heart surgery and got discharged from the hospital in good health! 🙏 #MBforSavingHearts@urstrulyMaheshpic.twitter.com/RinQcc93Bn
క్రాంతి కుమార్ అనే ఏడేళ్ల బాలుడు టెట్రాలజీ ఆఫ్ ఫాలట్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. 10 వేల మంది శిశువుల్లో ఇటువంటి సమస్య ముగ్గురికి మాత్రమే ఉంటుందట. పసిపిల్లల ప్రాణాలను తీసే ఈ వ్యాధికి చిన్నతనంలోనే చికిత్స చేస్తే ప్రాణాపాయం తప్పుతుంది. తాజాగా క్రాంతి కుమార్ విషయం మహేశ్ బాబుకు తెలియడంతో గుండె ఆపరేషన్ కు సాయం అందించారు. ఆ చిన్నారికి ఆంధ్రా ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడు. ఈ తరుణంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ తమ అభిమాన హీరో చేస్తున్న పనిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.