దర్శకరత్న రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. తాజాగా ఆయన డిజిటల్ బాట పట్టారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఆయన స్టార్ట్ చేశారు. కేఆర్ఆర్ వర్క్స్ పేరు ఆ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఆ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మందిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని, ఎంత చేసినా ఆయనలో తపన ఇంకా ఆగలేదని అన్నారు.
కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి అని నేను సంకల్పించిన మహాయజ్ఞం లో భాగంగా ఈ రోజు రాజమౌళి చేతుల మీదుగా KRR Works అనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించడం జరిగింది. https://t.co/k3dM1AyDq2
మరెంతో మందిని వెండి తెరకు పరిచయం చేయడానికి ‘కేఆర్ఆర్ వర్క్స్’ ఛానెల్‌ను రాఘవేంద్రరావు ఏర్పాటు చేశారన్నారు. ఆ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, 80 ఏళ్ల యంగ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ఆల్ ది బెస్ట్ అని రాజమౌళి తెలిపారు. సామాన్యులను సెలబ్రిటీలను చేయడం కోసం రాఘవేంద్రరావు కొత్త యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారని యాంకర్ సుమ అన్నారు. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టులు, యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ కథలను తమతో పంచుకోవాలని సూచనలు చేశారు.