»James Cameron Praised Charan Chiranjeevis Post Went Viral
Chiranjeevi Post Viral: చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు..చిరు పోస్ట్ వైరల్
దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ బరిలో నిలిచింది. తాజాగా మరోసారి హాలీవుడ్ దర్శక ధీరుడు జేమ్స్ కామెరూన్(James Cameron) ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఆస్కార్ అవార్డు(Oscar Awards)ల వేడుక కోసం ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood) మొత్తం ఈ వేడుక కోసం వెయ్యి కళ్లతో ఉత్కంఠగా చూస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ బరిలో నిలిచింది. తెలుగు పాట ఆ స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయం. ఈ సినిమా గురించి ఇప్పటికే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు గొప్పగా చెబుతూ ప్రశంసించారు. తాజాగా మరోసారి హాలీవుడ్ దర్శక ధీరుడు జేమ్స్ కామెరూన్(James Cameron) ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్:
Sir @JimCameron an acknowledgement of his character in #RRR from a Global Icon & Cinematic Genius like you is no less than an Oscar itself! It’s a great honor for @AlwaysRamCharan As a father I feel proud of how far he’s come. Ur compliment is a blessing for his future endeavours pic.twitter.com/jof3Q9j0pA
ఆస్కార్ పురస్కారాలు(Oscar Awards) దగ్గర పడుతుండగా జేమ్స్ కామెరూన్ తాను రూపొందించిన అవతార్2(Avatar2) కోసం ప్రమోషన్లను చేపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్తావించారు. రాజమౌళి విజన్ గురించి, రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో రామ్ చరణ్ పాత్ర తనకు ఎంతో నచ్చిందని, ఆ పాత్రను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పడుతుందని అన్నారు. చరణ్ పాత్ర ఒక్కసారి అర్థమయ్యాక మనసు ఎంతో బరువెక్కుతుందన్నారు. రామ్ చరణ్(Ram Charan) పాత్రను రాజమౌళి చాలా గొప్పగా మలిచారన్నారు. ఇదే విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పినట్లు తెలిపారు.
జేమ్స్ కామెరూన్(James Cameron) అలా స్పందించడంపై మెగాస్టార్ చిరంజీవి(Mega star Chiranjeevi) ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా జేమ్స్ కామెరూన్ వీడియోను షేర్ చేశారు. జేమ్స్ కామెరూన్ లాంటి గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేం కాదని చిరు తెలిపారు. జేమ్స్ కామెరూన్(James Cameron) ప్రశంసలు రామ్ చరణ్ కు ఒక గొప్ప గౌరవమని, చరణ్ సినీ ప్రయాణంపై ఒక తండ్రిగా తాను ఎంతో గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. జేమ్స్ కామెరూన్ అభినందన చరణ్ భవిష్యత్ కు ఆశీర్వాదమని ట్వీట్ చేశాడు.
What a historic moment for the entire Indian Film Industry… Couldn’t be more honoured to note that #NaatuNaatu becomes the first Indian song to be shortlisted for the Academy Awards! @ssrajamouli garu and @mmkeeravaani garu, it’s all your vision and magic..🙏❤️ #RRRForOscarspic.twitter.com/hdJuce16Zl
ఒక ఇండియన్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్(RRR) గురించి హాలీవుడ్ టెక్నీషియన్లు గొప్పగా మాట్లాడ్డం సంతోషంగా ఉందన్నారు. జక్కన్న విజన్, చరణ్, తారక్ ల నటనకు హాలీవుడ్ దర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇప్పటికీ జపాన్, చైనా లాంటి దేశాల్లో ఆర్ఆర్ఆర్(RRR) సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
Back in those days, a film running for 100days, 175 days etc was a big thing. The business structure changed over time…Gone are those fond memories…
But the Japanese fans are making us relive the joy ❤️❤️