Malli pelli: ‘మళ్లీ పెళ్లి’.. 15 కోట్లు పెట్టి రివేంజ్ తీర్చుకుంటున్నాడా!?
అదేదో పండగ అన్నట్టు.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో ఓ సీనియర్ లవ్‌స్టోరీ తెగ ట్రెండ్ అవుతోంది. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్.. ఈ ఇద్దరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పటి వరకు రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ను మీడియాలో మాత్రమే చూశాం.. కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది ఈజంట. దాని ఫలితమే 'మళ్లీపెళ్లి' సినిమా. అయితే దీంతో నరేష్ రివేంజ్ ప్లాన్ చేసినట్టే ఉందంటున్నారు. మరి నరేష్ ఏమంటున్నాడు!?
ఒకప్పుడు హీరోగా, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సీనియర్ నటుడిగా టాలీవుడ్లో నరేష్ మంచి పేరుంది. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో నరేష్ లేని సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే సినిమాల వరకు అంతా బాగానే ఉన్నా.. రియల్ లైఫ్‌లో ఈ సీనియర్ యాక్టర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆయన గురించి ప్రస్థావన వచ్చిన ప్రతీసారి పవిత్ర లోకేష్ మధ్యలోకి రావాల్సిందే. లేదంటే.. అది అన్ ఫుల్ఫిల్గానే మిగిలిపోతుంది. ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు పవిత్రతో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఆ మధ్య సినిమా ప్రమోషన్స్‌ను పెళ్లి అయినట్టుగా నమ్మించి.. అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడానికి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా చేస్తున్నారు.
విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు.. ప్రముఖ సీనియర్ దర్శక, నిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మే 26న చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా నరేష్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఈ సినిమా మీ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానా? అన్న ప్రశ్నకు.. అది మీరు చూస్తే తెలుస్తుందని అన్నారు. అయితే రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ తర్వాత మీ బయోపిక్ మీరు తీసుకుంటున్నట్లుగా ఉందని అడగ్గా.. అది బయోపిక్. ఇది ఎంటర్టైనర్ అని అన్నారు. ఇది నా సబ్జెక్ట్ కాదని అన్నారు. అయితే.. ఈ సినిమాతో మూడో భార్యపై రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు నవ్వుతూ ఆన్సర్ చెప్పారు.
ఆమె పై పగ తీర్చుకోవడానికి 15 కోట్లు పెట్టి సినిమా తియ్యాలా? యూట్యూబ్‌లో డబ్బులిస్తే ట్రోల్ల్స్ చేసే వారు దొరకరా? ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు, ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది. అలా రెండు మనసులు ఎలా కలుసుకున్నాయి? అనేదే మేము ఈ చిత్రం ద్వారా చెప్పాలి అనుకున్నాము.. అనేలా కామెంట్స్ చేశారు నరేష్. అయితే నరేష్ ఇది తన లవ్ స్టోరీ కాదని పైకి చెబుతున్నా.. ట్రైలర్ చూసిన తర్వాత, ఖచ్చితంగా ఈ సినిమా తన సీనియర్ లవ్‌స్టోరీనే అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి మళ్లీపెళ్లితో నరేష్ ఏం చెబుతాడో చూడాలి.