సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఐశ్వర్య లక్ష్మీ(Iswarya Lakshmi). గాడ్సే సినిమా(Godse Movie) ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ మూవీ హిట్ కాకపోయినా ఐశ్వర్యకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె నటించిన తమిళ్ చిత్రం మట్టికుస్తీ(Matti kusthi) తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత దక్షిణాదిలో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్యే విడుదలైన పొన్నియన్ సెల్వన్2(Ponniyan selvan2 Movie) సినిమాలోనూ ఐశ్వర్య పాత్ర అందర్నీ ఆకట్టుకుంది.
ఐశ్వర్య లక్ష్మీ(Iswarya Lakshmi) డాక్టర్ వృత్తి నుంచి యాక్టర్‌గా మారింది. కేవలం సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. గతంలో ఈమె యువ నటుడు, విలన్ క్యారెక్టర్స్ చేసే అర్జున్ దాస్(Arjun Das)తో ప్రేమలో పడిందనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ విషయంలో ఐశ్వర్య లక్ష్మీ క్లారిటీ ఇచ్చింది.
నటుడు అర్జున్ దాస్(Arjun Das)కు తనకు మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం నడవలేదని, ఆ వార్తల్లో నిజం లేదని ఐశ్వర్య లక్ష్మీ(Iswarya Lakshmi) తేల్చి చెప్పింది. ఇద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ టైంలో వారు ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకుమిందచి తమ మధ్య ఇంకేమీ లేదని ఐశ్వర్య లక్ష్మీ స్పష్టం చేసింది.
తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh)తో ప్రేమలో పడినట్లు ఐశ్వర్య లక్ష్మీ(Iswarya Lakshmi) వెల్లడించింది. యూవీ అంటే తనకు ఎంతో పిచ్చి అని, మనసులోనే ఆయన్ని ప్రేమించినట్లు చెప్పుకొచ్చింది. తాను పుట్టినప్పుడు తన తండ్రి తనకు శ్రీలక్ష్మీ అని పేరు పెడితే తన తల్లి మాత్రం ఐశ్వర్య లక్ష్మీ అనే పేరు పెట్టుకున్నట్లు తెలిపింది. తనకు విలన్ రోల్స్‌లో నటించడం అస్సలు ఇష్టం ఉండదని, ఎప్పటికీ ఆ పాత్రలు చేయనని తెలిపింది.