మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలు ప్రారంభమైతే చాలు బిజినెస్ లెక్కలు ప్రారంభమవుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఓటిటిలు స్టార్ హీరోల సినిమాలకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. మహేష్ బాబు… త్రివిక్రమ్ SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అప్పుడే బయ్యర్లు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా నైజాం రైట్స్ కోసం పోటీ నెలకొన్నది. ఈ సినిమా నైజాం రైట్స్ కోసం దిల్ రాజు రూ.45 కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. టాలీవుడ్లో దిల్ రాజు బిజీ ప్రొడ్యూసర్. ఇటీవల విజయ్ హీరోగా వచ్చిన వారసుడును దిల్ రాజు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇతను కోలీవుడ్ మార్కెట్లోకి కూడా ఎంటర్ అయ్యాడు. మరోవైపు, ఏషియన్ సునీల్ సిండికేట్ భారీగా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయట. నైజాం రైట్స్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం రంగంలోకి దిగాయి. నెట్ ఫ్లిక్స్ ఈ సీనిమా కోసం భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా 80 కోట్ల డీల్‌తో అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు SSMB28 ఓటీటీలోను రికార్డులు బద్దలు కొడుతోంది. రూ.80 కోట్ల డీల్ అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఇది రికార్డ్. ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి కాలేదు. అప్పుడే భారీ డిమాండ్ ఏర్పడటం అంచనాలను మరింత పెంచుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే రూ.250 కోట్ల నుండి రూ.300 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయనున్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి.