ప్రముఖ జ్యోతిష్కుడు అయిన వేణు స్వామి(Venu swamy)తో మరో హీరోయిన్ రహస్య పూజలు చేస్తూ కనిపించింది. వేణు స్వామి పేరు గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది. టాలీవుడ్(Tollywood) స్టార్ సెలబ్రిటీలు సైతం వేణు స్వామి దగ్గరికి క్యూ కడుతున్నారు. లైఫ్ లో ఏం జరగబోతోందో వేణు స్వామి కళ్లకు కట్టినట్లు చెబుతూ ఆయన పాపులారిటీ దక్కించుకున్నారు. సమంత, నాగచైతన్య విడిపోతారని ఆయన ఎప్పుడు చెప్పారో అప్పటి నుంచి ఆయన జాతకాలపై అందరూ నమ్మకం ఉంచారు.
ఈమధ్యనే రామ్ చరణ్ కూతురి జాతకం గురించి కూడా చెప్పి వేణు స్వామి వార్తలో నిలిచారు. ఆ మధ్య హీరోయిన్ రష్మిక(Rasmika) ఇంట్లో వేణు స్వామి(Venu swamy) పూజలు చేస్తూ కనిపించారు. ఆ తర్వాత ఈ మధ్యనే మరో హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi agarwal)తో కూడా ఆయన పలు పూజలు చేస్తూ మీడియా కంట పడ్డారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Videos Viral) అవుతున్నాయి.
తాజాగా ఇప్పడు మరో హీరోయిన్ డింపుల్ హయతి(Dimple Hayathi)తో వేణు స్వామి(Venu swamy) పూజలు చేయించారు. డింపుల్ ఇంట్లో వేద మంత్రాల నడుమ ఆయన పూజలు చేయించారు. డింపుల్ హయతి యాగం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ తరుణంలో వేణు స్వామి పేరు మరోసారి మారుమోగుతోంది. హీరోయిన్ డింపుల్ హయతి ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్2లో నటిస్తోంది.