»Deepika Padukone Leaked Charan And Ntrs Hollywood Agreement
Charan-NTR: చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ అగ్రిమెంట్.. లీక్ చేసిన దీపిక పదుకొనే!
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడంతో.. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు ఇద్దరు. అంతేకాదు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఇచ్చిన లీకేజీ మాత్రం అదిరిపోయేలా ఉంది.
ఆస్కార్(Oscar) ప్రమోషన్స్‌లో ఓ హాలీవుడ్(Hollywood) ప్రాజెక్ట్ చేస్తున్నట్టు, రెండు మూడు నెలల్లో హాలీవుడ్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్(Ram charan). అయితే ఎన్టీఆర్ మాత్రం హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం ఇంటికి రావడంతో.. ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ మూవీ చేయబోతున్నాడనే వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.
ఇక ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయనున్నాడు. అలాగే బాలీవుడ్లో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరు హాలీవుడ్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేయనున్నారు.. అనేది లేటెస్ట్ అప్డేట్. ట్రిపుల్ ఆర్ చూసిన తర్వాత చాలా మంంది హాలీవుడ్ మేకర్స్ చరణ్, తారక్‌తో సినిమాలు చేసేందుకు ట్రై చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అడుగులు హాలీవుడ్ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే లీక్ చేసేసింది.
దీపిక హస్బెండ్ రణ్ వీర్ సింగ్ హాలీవుడ్ ఏజెన్సీ విలియం మోరీస్‌తో డీల్ సెట్ చేసుకున్నాడు. అయితే.. ఇదే సంస్థతో ఎన్టీఆర్, చరణ్ కూడా డీల్ చేసుకున్నట్టు బాలీవుడ్ మీడియా టాక్. అంతేకాదు చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీకోసం రాజమౌళి కూడా తనవంతు కృషి చేస్తున్నాడట. ఇప్పటికే అక్కడ పీఆర్ టీంని కూడా సెట్ చేశాడట జక్కన్న. అయితే ఇలాంటి విషయాలు ఇప్పుడిప్పుడే అఫిషీయల్‌గా బయటికొచ్చే ఛాన్స్ లేదు. అంతా సెట్ అయ్యాక చరణ్, తారక్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి.. ఈ స్టార్ హీరోల హాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడుంటుందో!