NTR-Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్‌పై హాలీవుడ్ నటుడు ప్రశంసల వర్షం..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఇక, ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఈ ఇద్దరు స్టార్స్ పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా చూసిన హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో కలిసి పనిచేయడం గర్వకారణమన్నాడు.
క్రిస్ హేమ్స్‌వర్త్(Chris Hemsworth) నటించిన ఎక్స్ట్రాక్షన్ 2 త్వరలో స్ట్రీమింగ్ కానుంది. 2020లో విడుదలైన ఎక్స్ట్రాక్షన్కు ఇది సీక్వెల్. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన హేమ్స్‌వర్త్ ..జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పనిచేసే అవకాశమొస్తే గర్వకారణమన్నాడు. క్రిస్ హేమ్స్‌వర్త్ తొలిసారిగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో కలిసి నటించిన సినిమా ఎక్స్ట్రాక్షన్. ఈ సినిమా ఎక్కువ భాగం ఇండియాలోనే షూట్ అయింది. ఇండియా అంటే ఇష్టపడే ఈ నటుడు తన కూతురి పేరు కూడా ఇండియా అని పెట్టుకోవడం విశేషం. ఎక్స్ట్రాక్షన్ 3 కూడా భారతదేశ నటులతోనే ఉంటుందన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవలే చూశానని..రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రశంసించాడు. ఆ ఇద్దరితో కలిసి పనిచేసే అవకాశమొస్తే అంతకంటే ఆనందించేది ఉండదన్నాడు.