మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళాశంకర్(Bholashankar)’ సినిమా రూపొందుతోంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హీరోకి చెల్లెలిగా కీర్తి సురేశ్ (Keerthy Suresh) కనిపించనుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. సుశాంత్ (Sushant) కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర (RamaBrahmam Sunkara) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.భోళా శంకర్ సినిమా తమిళ్ లో అజిత్ చేసిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక భోళా శంకర్ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్(Teaser release) చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో చిరు తెలంగాణ భాషలో క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో ఫుల్ మాస్ గా చిరుని చూపించారు. చివర్లో స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్ళే అంటూ డైలాగ్ అదరగొట్టారు మెగాస్టార్(Megastar).’ఒక్కడు 33 మందిని చంపేశాడు .. ఎలా?’ అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఆ ప్రశ్నకి సమాధానంగా మెగాస్టార్ రౌడీల భరతం పట్టడం చూపించారు. ‘ షికారుకొచ్చిన షేర్ ను బే .. నాకు హద్దుల్లేవ్ .. సరిహద్దుల్లేవ్’ అంటూ చిరూ చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్ కి హైలైట్ గా చెప్పుకోవాలి. యాక్షన్ సీన్స్(Action scenes) .. మాస్ డైలాగ్స్ పై కట్ చేసిన ఈ టీజర్ మెగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. 2015లో అజిత్(Ajith) హీరోగా వచ్చిన ‘వేదాళం’ సినిమాకి ఇది రీమేక్. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మెగాస్టార్ బర్త్ డేకి దగ్గరలో వస్తున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించవచ్చనేది ఫ్యాన్స్ మాట.