మరో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేకి పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్(Adilabad) జిల్లా బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారుకు ఆవు అడ్డుచ్చింది. దీంతో ఆవును వాహనం డీకొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతింది. ఎమ్మెల్యే బాపురావు (MLA Bapurao) చేతి వేళ్లకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావడంతో.. ఎమ్మెల్యేను హుటాహుటిన చికిత్స నిమిత్తం మరో వాహనంలో ఆదిలాబాద్ హాస్పిటల్(Hospital)కు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బాపురావు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇవాళ ఉదయం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Rohit Reddy) కారుకు ప్రమాదం జరిగింది.