హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పలు రకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అవే ఏంటో ఇప్పుడు చుద్దాం.
బింబిసార మూవీ సక్సెస్ తర్వాత హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్(Amigos) నేడు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్(kalyan ram) సరసన ఆషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ఈ సినిమాలపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ఎమంటున్నారో ఇప్పుడు చుద్దాం.
ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోపాటు స్క్రీన్ ప్లే కూడా బాగుందని అంటున్నారు. మూవీ బాగుందని హిట్, బ్లాక్ బాస్టర్, సూపర్ మూవీ అంటూ ఇంకొంత మంది ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఓవరాల్ గా హీరో కళ్యాణ్ రామ్ గారు అద్భుతమైన ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంచి క్లాసీ చిత్రమని దీనికి 3 రేటింగ్ ఇస్తున్నట్లు కామెంట్లు చేశారు. దాదాపు అనేక మంది అభిమానులు ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి.
యాక్షన్, థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయని త్రిపాత్రాభినయంలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నారని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ రీమేక్ సాంగ్ ఎన్నో రాత్రులొచ్చాయనే పాట బాగుందని అంటున్నారు. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి స్టోరీ అందించి డైరెక్షన్ చేయగా, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.