టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మూవీ సీన్ లీక్ అయ్యిందని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Alluarjun), డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పుష్ఫ2 (Pushpa2 Movie). గతంలో పుష్ప(Pushpa) సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీకి సెకండ్ పార్ట్ రూపొందుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డాన్స్ స్టెప్పులు విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పాపులారిటీని సాధించింది. దీంతో ఈ మూవీ రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెండో పార్ట్‌ను డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్(Shooting) హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో, మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఓ వీడియో లీక్(Video Leak) అయ్యింది. ఆ వీడియోలో ఎర్రచందనం లోడ్‌తో నాలుగు లారీలు నదిలో వెళ్తుంటే, వాటిని ఛేజ్ చేస్తూ రెండు జీపులు వెనకాలే వస్తూ ఉంటాయి.
లీక్ అయిన సీన్(scene Leak) అవుట్ డోర్ షూటింగ్ కావడంతో కొందరు ఫ్యాన్స్ ఆ విజువల్స్ ను ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది. పుష్ఫ2 మూవీ(Pushpa2 Movie)లో హీరోయిన్గా రష్మిక మందన్న(Rasmika Mandanna) నటిస్తోంది. మొదటి పార్ట్‌లో సునీల్, అజయ్ ఘోష్ విలన్లుగా కనిపిస్తే రెండో పార్టులో ఫహాద్ ఫాసిల్(Fahad Fassil) మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడు. జగపతిబాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే లీక్ అయిన వీడియో పుష్ప మూవీకి సంబంధించిందేనా అనేది తెలియాల్సి ఉంది.