Prabhas : ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్.. రామాయణం ఆధారంగా విజువల్ గ్రాండియర్‌గా.. సుమారు 600కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత.. మరో అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్.. రామాయణం ఆధారంగా విజువల్ గ్రాండియర్‌గా.. సుమారు 600కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత.. మరో అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. టీజర్ ఆకట్టుకోకపోవడంతో.. జూన్ 16 పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మాత్రమే చెప్పారు. అది తప్పితే మరో అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్‌పై ఫైర్ అవుతున్నారు. అప్డేట్ ఇవ్వలంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ తాజాగా ఆదిపురుష్ నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. మార్చ్ 30న శ్రీరామ నవమి కానుకగా అప్డేట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అలాగే.. అప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. అందుకే ప్రభాస్ అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ పోస్టర్‌తో 50 ఫీట్స్ కటౌట్‌ను ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద.. అదిరిపోయేలా కటౌట్‌ని ఏర్పాటు చేయబోతున్నట్లు టాక్. దీంతో ఈసారి శ్రీరామనవమికి ఆదిపురుష్ అప్డేట్ రావడం పక్కా అని చెప్పొచ్చు. అయితే శ్రీరామనవమికి టీజర్ రిలీజ్ చేస్తారా.. లేదంటే సాంగ్ రిలీజ్ చేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తుండగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు ఓం రౌత్. మరి ఈసారిఒ ఆదిపురుష్ నుంచి ఎలాంటి అప్డేట్ ఉంటుందో చూడాలి.