NLR: కావలిలోని స్నేహితుడి తండ్రి చావుకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కల్లూరుపల్లికు చెందిన రాజ్ కుమార్ (35) తన స్నేహితుడితో కలిసి కావలి నుంచి కొత్త వెల్లంటి వెళ్లే దారిలో ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో హాస్పిటల్ తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.